ఐపీపీబీ యాప్ ద్వారా పోస్టాఫీస్ డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Join Our Community
follow manalokam on social media

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) త‌న ఐపీపీబీ మొబైల్ యాప్ ద్వారా సేవింగ్స్ ఖాతాదారుల‌కు అనేక స‌దుపాయాల‌ను అందిస్తోంది. గ‌తంలో ఈ అకౌంట్‌లో డ‌బ్బులు డిపాజిట్ చేయాల‌న్నా, ఇత‌ర సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌న్నా ఖాతాదారులు స‌మీపంలో ఉన్న పోస్టాఫీస్‌ల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ యాప్ వ‌ల్ల ప్ర‌స్తుతం అకౌంట్‌ను ఓపెన్ చేయ‌డంతోపాటు ఇత‌ర సేవ‌ల‌ను కూడా అందులో ఉప‌యోగించుకునేందుకు వెసులుబాటు క‌లిగింది.

how you can open digital post office account through ippb app

ఐపీపీబీ యాప్ ద్వారా ఖాతాదారులు పోస్టాఫీస్‌లో డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్ను ఓపెన్ చేయ‌వ‌చ్చు.. అందుకు ఈ స్టెప్స్‌ను అనుస‌రించాలి.

* పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను ఆన్ లైన్ లో ఓపెన్ చేసేందుకు ఖాతాదారుల‌కు క‌నీస వ‌య‌స్సు 18 ఏళ్లు ఉండాలి.
* ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. అనంత‌రం యాప్‌ను ఓపెన్ చేసి అందులో ఓపెన్ అకౌంట్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.
* పాన్‌, ఆధార్ నంబ‌ర్ వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.
* ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.
* ఆ ఓటీపీని ఎంట‌ర్ చేసి వెరిఫై చేయాలి. త‌రువాత విద్యార్హ‌తలు, చిరునామా, నామినీ త‌దిత‌ర వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.
* దీంతో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ అకౌంట్‌ను అప్పుడే వినియోగించుకోవ‌చ్చు.
* అయితే అకౌంట్ ఓపెన్ చేసిన త‌రువాత ఏడాది లోగా ఏదైనా పోస్టాఫీస్‌కు వెళ్లి బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్‌ను పూర్తి చేయాలి. దీంతో అకౌంట్‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకునేందుకు వీల‌వుతుంది. అలాగే అకౌంట్‌కు కూడా డిజిట‌ల్‌కు బ‌దులుగా రెగ్యుల‌ర్ సేవింగ్ అకౌంట్‌గా మారుతుంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....