చెన్నై వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పరాజయం చవిచూసింది. కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన జట్టు ఇంగ్లండ్ నిర్ణయించిన స్కోరుని అందుకోలేకపోయింది. మొదటి ఇన్నింగ్సులో అంతగా ఆకట్టుకోలేకపోయిన భారత జట్టు, రెండవ ఇన్నింగ్సులో బాగానే ఆడింది. కానీ మొదటి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేయడంతో రెండవ ఇన్నింగ్సు వచ్చేసరి 420పరుగుల భారీ లక్ష్యం ముందు కనబడింది.
భారీ పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 190పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో కోహ్లీ సేనకి మొదటి ఓటమి వచ్చింది. కెప్టెన్ కోహ్లీ ఎంత పోరాడినా గెలుపు దాకా చేరుకోలేకపోయారు. 72పరుగులు చేసిన కోహ్లీ, చాలా కష్టపడ్డాడు. మిగిలిన వారిలో శుభ్ మన్ గిల్ తప్ప ఎవరూ పెద్దగా ఆడలేరు. మొత్తానికి నాలుగు టెస్టుల సిరీస్ లో ఒక టెస్ట్ గెలిచి 1-0అధిక్యాన్ని ఇంగ్లాండ్ సంపాదించుకుంది. రెండవ టెస్ట్ ఈ నెల 13వ తేదీ నుండి చెన్నైలోనే జరగనుంది.