ఐసీఐసీఐ గుడ్ న్యూస్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు..!

ఐసీఐసీఐ ICICI బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో కస్టమర్స్ ఎలాంటి డబ్బు చెల్లించక్కర్లేకుండా క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కొత్తగా క్రెడిట్ కార్డు పొందాలని ఇది బెస్ట్ ఆప్షన్.

ఐసీఐసీఐ /ICICI

పైగా మీరు సులభంగానే ఎలాంటి చార్జీలు లేకుండా క్రెడిట్ కార్డు పొందొచ్చు. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఈ అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తోంది. దీనితో కస్టమర్స్ ఎంతో ఈజీగా, ఫ్రీగా పొందొచ్చు.

ఇక ఈ కార్డు గురించి చూస్తే… ఈ కార్డుని ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ పే కలిసి తీసుకు వస్తున్నారు.
ఇది అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు . 2018 నుంచి ఈ కార్డు అందుబాటులో ఉంది. ఈ కార్డుని 20 లక్షల మందికి పైగా తీసుకోవడం జరిగింది.

మీరు కూడా క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావిస్తే.. ఈ కార్డును ట్రై చేయొచ్చు. అమెజాన్ ఉపయోగించే వారు ఈ క్రెడిట్ కార్డు తీసుకవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు అవ్వాల్సినక్కర్లేదు. అలానే వీడియో కేవైసీ ద్వారా సులభంగానే ఈ క్రెడిట్ కార్డు పొందొచ్చు.

వార్షిక, జాయినింగ్ ఫీజులు ఉండవు. అన్‌ లిమిటెడ్ రివార్డు లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు 5 శాతం రివార్డు పాయింట్లు పొందొచ్చు. అదే సాధారణ కస్టమర్లకు అయితే 3 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి.