Anchor Pradeep : యాంకర్‌ ప్రదీప్‌తో శ్రీముఖి పెళ్లి..!

-

యాంకర్‌ ప్రదీప్‌ మరియు శ్రీముఖి గురించి తెలియని వారుండరు. టీవీ యాంకర్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. అంతేకాదు.. తెరపై వీళ్లిద్దరు చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే.. తాజాగా ఈ జంటపై ఓ వార్త వైరల్‌ అవుతోంది. యాంకర్‌ ప్రదీప్‌, శ్రీముఖి పెళ్లి పీట లెక్కబోతున్నారట. ఈ మేరకు వీళ్లిద్దరి ఇంటి పెద్దలు కూడా వివాహనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. కరోనా వైరస్‌ ఉధృతి ఉన్న నేపథ్యంలో… ఈ సమయంలో పెళ్లి వద్దనుకున్నారట.

అయితే.. సెప్టెంబర్‌ లో మంచి ముహుర్తాలు ఉన్నందున… ఆ మాసంలోనే పెళ్లికి చేసుకోవాలని ఇద్దరు ఫిక్స్‌ అయ్యారని టాక్‌. అంతేకాదు.. సెప్టెంబర్‌ 2 న పెళ్లి అని కూడా ఓ వార్త వైరల్‌ అవుతోంది. అయితే… దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇది ఇలా ఉండగా… ఓ వైపు రియాలిటీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాలతో అలరిస్తున్న ప్రదీప్‌, శ్రీముఖి మధ్య ఏదో ఉందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు శ్రీముఖి యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది కూడా ప్రదీప్‌తోనే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news