మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యినట్టైతే ఇలా కంప్లైంట్ చెయ్యండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు ని ఎక్కువగా ఐడీ ఫ్రూవ్ గా వాడుతూ ఉంటాము. అలానే బ్యాంకింగ్ మొదలు ఐటీ రిటర్న్స్ దాకా ఎన్నో వాటికి ఇది అవసరం. అయితే పాన్ వివరాలు ఎక్కడెక్కడ ఇచ్చారో త‌ప్ప‌ని స‌రిగా అంద‌రూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాన్ కార్డును కొందరు సైబ‌ర్ నేర‌గాళ్లు, మోస‌గాళ్లు దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ పాన్ కనుక దుర్వినియోగం అయితే ఏం చెయ్యాలి..?, ఎలా కంప్లైంట్ పెట్టాలి అనే దాని గురించి చూద్దాం.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పాన్ దుర్వినియోగం గురించి తెలుసుకోవడానికి ఫారం 26 AS ని ఇన్ కం ట్యాక్స్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిని ట్రేస్ పోర్టల్ నుంచి కూడా మీరు పొందొచ్చు. ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత ట్రాన్సక్షన్స్ ని చెక్ చెయ్యడం అవుతుంది. ఇక ఎలా కంప్లైంట్ పెట్టాలి అనేది చూస్తే..

కంప్లైంట్ చెయ్యడానికి ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఎల‌క్ట్రానిక్ పోర్ట‌ల్ ను ఓపెన్ చెయ్యాలి.
యూటీఐటీఎస్ఎల్ కి నేరుగా లింక్ చేయ‌బ‌డిన ఈ పోర్ట్ ద్వారా పాన్ ఫిర్యాదుల‌ను చేయ‌వ‌చ్చు.
https://incometax.intalenetglobal.com/pan/pan.aspx సైట్ కి వెళ్లి
అవసరమైన వివరాలను ఎంటర్ చెయ్యాలి. తరవాత సబ్మిట్ చెయ్యాలి.
ఫిర్యాదు ర‌కం, ర‌శీదు సంఖ్య వంటివి న‌మోదు చేసి సబ్మిట్ చెయ్యండి. అప్పుడు కంప్లైట్ ఇవ్వడం అవుతుంది.

పాన్ కార్డు దుర్వినియోగం అవ్వకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి:

పాన్ ఇవ్వకుండా పని జరగదు అన్న చోట మాత్రమే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి.
పాన్ కార్డ్ కాపీని ఇస్తుంటే దానిపై సంతకం చేయాలి. అలానే డేట్ కూడా వెయ్యండి.
అనవసరంగా పాన్ కార్డు అన్నింటికీ ఇచ్చేయద్దు.

Read more RELATED
Recommended to you

Latest news