ఈ బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్..!

ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారం. మీకు ఆంధ్రా బ్యాంక్‌లో అకౌంట్ ఉంటె తప్పకుండ ఈ ఎలర్ట్ గురించి తెలుసుకోండి. వచ్చే మూడు రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనుంది. ఆ మేరకు పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే… బ్యాంక్ కస్టమర్లకు ఇప్పటికే ఎస్ఎంఎస్ రూపంలో ఈ విషయాన్ని తెలియజేసింది.

జనవరి రాత్రి 10 గంటల నుంచి జనవరి 11 ఉదయం 6 గంటల వరకు సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఐటీ వ్యవస్థలను అప్ ‌గ్రేడ్ చేస్తున్నందుకే ఈ అంతరాయమన్నారు. దీంతో ఏటీఎం, ఆన్‌లైన్ సర్వీసులకు అంతరాయం కలగొచ్చు అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కనుక బ్యాంక్ కస్టమర్లు ఈ తేదీలని గుర్తించుకొని అందుకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవడం ఉత్తమం.

ఒకవేళ మీకు కనుక ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటే నేరుగా బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఏమైనా పని ఉంటే పూర్తి చేసుకోవడం మేలు. లేకపోతే మీకే ఇబ్బంది కలుగవచ్చు. ఇది ఇలా ఉండగా యూనియన్ బ్యాంక్‌ లో మరో రెండు బ్యాంకులు విలీనమైన విషయం తెలిసిందే. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అనేవి యూనియన్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. కనుక ఈ బ్యాంక్ ఖాతాదారులు కలిగే అంతరాయం గురించి తెలుసుకోవడం మంచిది.