సంపాదించక పోయిన ట్యాక్స్ పడుతుందా…?

-

సంపాదించే వారు మాత్రమే కాదు సంపాదించక పోయిన ట్యాక్స్ కట్టాలట. నేను పెద్దగా సంపాదించడం లేదు కదా….! అయితే ప్రభుత్వానికి ఎలాంటి టాక్స్ కట్టక్కర్లేదు అని అనుకుంటే పొరపాటే. మీరు సంపాదించినా లేక పోయినా ట్యాక్స్ మాత్రం కడుతూనే ఉండాలి. మన దేశం లో ఉన్న రెండు రకాల ట్యాక్స్‌లు ఏమిటి అనే విషయానికి వస్తే… ఒకటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. అయితే డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూస్తే… వీటిని నేరుగా మనం ప్రభుత్వానికి చెల్లించే పన్నులు. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నేరుగా మన పై ఈ పన్ను విధిస్తుంది.

అలానే ప్రత్యక్ష పన్నుల్లో మళ్లీ చాలా రకాల పన్నులు ఉన్నాయి. అవే… ఇన్‌కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మొదలైనవి… మీరు కనుక సంపాదిస్తే ఈ ప్రత్యక్ష పన్ను కట్టాలి. ఇక పరోక్ష పన్నులు విషయానికి వస్తే… మీరు సంపాదించక పోయినా కూడా కట్టే పన్నులే ఇవి. జీఎస్‌టీని పరోక్ష పన్నులకు మనం చెప్పొచ్చు. ఈ టాక్స్ మీరు కొనుగోలు చేసే వస్తువులపై పడుతుంది. మీరు ప్రొడక్టులను కొనుగోలు చేయడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వానికి పన్ను కట్టాలి. ఇక్కడ కొనడమే ముఖ్యం. సంపాదించడం కాదు.

ఇది ఇలా ఉండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2021-22ను ఆవిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ బడ్జెట్ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మోదీ సర్కార్ ఈ బడ్జెట్ తీసుకు వస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ గురించి చూస్తే… ఇది జనవరి 29న పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభమౌతుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news