మీరు మీ కలలని సాకారం చేసుకోవాలనుకుంటున్నారా…? మీరు ఎక్కువ డబ్బులని పొందాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక దీని కోసం తెలుసుకుని తీరాలి. మీ కలల్ని సాకారం చేసుకోవాలంటే..? పీపీఎఫ్ లో డబ్బులు పెడితే చాలు. అయితే ఇందులో మీరు రోజుకు రూ.400 ఆదా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు భవిష్యత్ కోసం చాల డబ్బులు ఆదా ఇప్పటి నుండి చేసేయొచ్చు. ఇక వివరాల లోకి వెళితే… భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే డబ్బులు ఆదా చేయాలని ప్లాన్ చేసుకుందాం అని అనుకునే వాళ్లకి ఇది సూపర్ బెనిఫిట్స్ ఇస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPFలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలం లో మంచి రాబడి పొందొచ్చు. రాబడి తో పాటుగా మరో బెనిఫిట్ కూడా లభిస్తుంది. అదేమిటంటే మీరు టాక్స్ నుండి కూడా సేవ్ అవ్వొచ్చు. బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పీపీఎఫ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.
ఇప్పుడు అయితే పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పీపీఎఫ్ వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఐదేళ్ల చొప్పున పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని ఎక్స్టెండ్ కూడా చెయ్యొచ్చు. 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో పీపీఎఫ్ అకౌంట్ తెరిస్తే నెలకి రూ.12,500 ఇందులో కనుక పెడితే 15 ఏళ్లలో మీకు రూ.40 లక్షలు లభిస్తాయి. ఐదేళ్ల చొప్పున రెండు సార్లు మెచ్యూరిటీ కాలాన్ని కనుక ఎక్స్టెండ్ చేసి 25 ఏళ్లపాటు డబ్బులు ఇందులో పెడితే మీరు రూ.1.02 కోట్లు పొందొచ్చు.