ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలు జరిగాయన్న ఫిర్యాదులపై ఎస్ఈసీ స్పష్టత ఇచ్చింది. బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలపై ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలా అందిన ఫిర్యాదులను వచ్చే నెల రెండో తేదీలోగా కమిషనుకు పంపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.
వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అభ్యర్థిత్వాల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. బలవంతంగా నామినేషన్ల ఉప సంహరణ వంటి సంఘటనలు జరిగితే.. అభ్యర్థిత్వాలను పునరుద్దరించే అధికారం ఎస్ఈసీకి ఉందని నిమ్మగడ్డ ఆదేశాలలో పేర్కొన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరాయి. ఇప్పటికే జనసేన బహిరంగంగా ఈ డిమాండ్ చేయగా ఇప్పుడు తెలుగు దేశం కూడా ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. దీంతో ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.