IRCTC హనీమూన్ ట్రిప్…! వివరాలు ఇవే…

-

మీరు హనీమూన్ కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు సూపర్ ఛాన్స్. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిమ్లా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దీనితో మీరు సూపర్ గా షిమ్లా తో పాటు ధర్మశాల, అమృత్‌సర్ మొదలైన వాటిని చూడొచ్చు. ‘హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్’ పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. అయితే ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాల లోకి వెళితే… 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఏప్రిల్ 14న ఈ టూర్ స్టార్ట్ అవుతుంది.

హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.32,250. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. అదే డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.33,950. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.47,950. ఫ్లైట్ టికెట్స్, హోటల్ ధరలు, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్‌లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా ఇందులోనే. https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు. ఇక రోజుల వారీగా చూస్తే…

మొదటి రోజు: ఉదయం 7.50 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్. 10:25 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. అక్కడకి వెళ్ళాక హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాక రాక్ గార్డెన్, సుఖ్నా లేక్ చూడొచ్చు. రాత్రికి చండీగఢ్‌లోనే స్టే చెయ్యాలి.

రెండవ రోజు: అక్కడ నుండి అమృత్‌సర్ స్టార్ట్ అవ్వాలి. దారిలో జలంధర్ చూడొచ్చు. అమృత్‌సర్ వెళ్ళాక వాఘా బార్డర్ తీసుకెళ్తారు. అక్కడే ఈ రాత్రి స్టే చెయ్యాలి.

మూడో రోజు: మార్కింగ్ గోల్డెన్ టెంపుల్ చూడొచ్చు. నెక్స్ట్ ఝలియన్‌వాలా బాగ్ సందర్శించాలి. ధర్మశాలకు కూడా వెళ్ళాలి. రాత్రికి ధర్మశాలలోనే స్టే చెయ్యాలి.

నాలుగో రోజు: టిబెటన్ మానస్ట్రీ, హెచ్‌పీ క్రికెట్ స్టేడియం చూడొచ్చు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది.

ఐదో రోజు: ఉదయం ధర్మశాల నుంచి షిమ్లా స్టార్ట్ అవ్వాలి. షిమ్లా చేరుకున్న తర్వాత రాత్రికి అక్కడే స్టే చేయాలి.

ఆరవ రోజు: షిమ్లా లోకల్ సైట్‌ సీయింగ్ ఉంటుంది. కుఫ్రీ, మాల్ రోడ్ చూడొచ్చు. రాత్రికి షిమ్లా లోనే స్టే చెయ్యాల్సి ఉంటుంది.

ఏడో రోజు: ఉదయం చండీగఢ్ బయల్దేరాలి. అక్కడే రాత్రి 7.25 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news