మొదలైన కేంద్రీయ విద్యాలయ 1 వ తరగతి అడ్మిషన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

-

కేంద్రీయ విద్యాలయ 1 వ తరగతి అడ్మిషన్స్ మొదలయ్యాయి. 2022 కోసం రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. కనుక అర్హత వున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల లోకి వెళితే.. తల్లిదండ్రులు KVS అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmissions.kvs.gov.inలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లు కి సంబంధించి ముఖ్యమైన విషయాలు:

1వ తరగతికి అడ్మిషన్ కావాలనుకునేవారు మార్చి 31 నాటికి పిల్లలకి 6 సంవత్సరాలు ఉండాలి.
ఏప్రిల్ 1న పుట్టిన పిల్లలను కూడా అడ్మిషన్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లు కి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే:

  • ఫిబ్రవరి 28, 2022: అడ్మిషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు ప్రారంభ తేదీ
  • మార్చి 21, 2022: చివరి తేదీ
  • ఏప్రిల్ 1, 2022 : రెండవ జాబితా
  • ఏప్రిల్ 8, 2022: మూడవ జాబితా

కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లు కి కావాల్సిన డాక్యుమెంట్స్:

  • ఒక ఫోటో స్కాన్ చేసినది
  • పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • EWS కోసం ప్రభుత్వ సర్టిఫికేట్
  • SC/ ST కేటగిరీ వాళ్ళైతే SC/ ST కేటగిరీ సర్టిఫికేట్
  • దివ్యంగుల కేటగిరికి చెందిన వారికి PwD సర్టిఫికేట్

కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లు కి ఇలా నమోదు చేసుకోండి:

  • అడ్మిషన్లు కి ముందు kvsonlineadmission.kvs.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యండి.
  • నెక్స్ట్ మీరు లాగిన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • ముఖ్యమైన వివరాలను ఎంటర్ చెయ్యండి.
  • ఆ తరవాత మీరు డాక్యుమెంట్స్ ని అప్‌లోడ్ చేయండి.
  • ఆ తరవాత బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఫైనల్ గా ప్రింట్ అవుట్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version