కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారా? ఐతే డబ్బెలా ఖర్చు పెట్టాలో తెలుసుకోండి..

Join Our Community
follow manalokam on social media

ఉద్యోగం రాగానే చాలా మందికి రెక్కలు వచ్చేస్తాయి. అప్పటి వరకు ఇంట్లో డబ్బులు అడిగిన వారు ఆపై సంపాదించే స్టేజికి వచ్చేస్తారు కాబట్టి, తమ ఇష్టం ఉన్నంత ఖర్చు చేసుకోవచ్చని ఫీల్ అవుతారు. ఐతే జాబ్ చేరిన కొత్తలో విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళుంటారు. అలా ఖర్చు పెట్టేవాళ్ళు, లగ్జరీలకి అలవాటు పడేవారు కొన్ని విషయాలని తెలుసుకోవాలి. మీకొచ్చే డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలో తెలుసుకోకపోతే ఇబ్బందుల పాలవుతారు. అందుకే డబ్బుని ఖర్చు పెట్టడం తెలుసుకోండి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లయితే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెడుతుంటారు. అలా పెట్టేవాళ్ళకి చిన్న గమనిక. వాయిదా పద్దతుల్లో కొనాలని చూసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలా అమ్మేవారి పేరు మీద ఆ భూమి ఉండకపోవచ్చు. మూడు నాలుగు వాయిదాలు కాగానే అవతలి వాళ్ళు జెండా ఎత్తేసే ప్రమాదం ఉంది. ఎక్కడయినా ప్లాట్ కొనాలనుకుంటే, మీకు దగ్గరలో ఉండేలా చూసుకోండి. మీకు తెలియని ప్రదేశంలో ప్లాట్ కొని, అది కాపాడుకోవడానికి కష్టాలు పడకండి.

అన్నింటి కంటే ముందు టర్మ్ పాలసీ తీసుకోండి. ఏదైనా రిస్క్ జరిగితే మీ ఇంట్లో వాళ్ళకి పనికొచ్చే టర్మ్ పాలసీ తీసుకుంటే బెటర్. ఇంకా అమ్మా నాన్నలకి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది. వయసు పెరుగుతుంది కాబట్టి, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ముందే అప్రమత్తం అవడం మంచిది.

జీతం వస్తుంటే చాలా మంది చేసే పని షేర్లలో పెట్టుబడులు పెట్టడం. మీకు అసలేమీ తెలియని రంగంలో వేలు పెట్టకండి. ముఖ్యంగా షేర్లలో ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో అస్సలు తెలియదు. కాబట్టి అందులో పెట్టకపోవడమే మంచిది. వాటికి బదులు మ్యూచువల్ ఫండ్లు కొద్దిగా ఫర్వాలేదు.

ఆడంబరాలకి పోయి వాయిదా పద్దతుల్లో ఇంటినిండా సామాన్లు కొనకండి. మనకి అవసరం లేకపోయినా రిచ్ గా ఉండాలన్న ఉద్దేశ్యంతో అన్నీ తీసుకోవద్దు. మీకు నిజంగా అవసరం ఉంటేనే కొనండి.

TOP STORIES

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో...