నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ …!

-

మీరు జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో సారి నోటీఫికేషన్ వచ్చింది. పలు ఖాళీలని భర్తీ చెయ్యనున్నారు. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చెయ్యచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏప్రిల్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాల లోకి వెళితే… యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) విడుదల చేసిన నోటీఫికేషన్ లో వున్నా పోస్టుల వివరాలని చూస్తే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్) విభాగం లో 14 పోస్టులు ఉన్నాయి. అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ) లో 2 పోస్టులు ఉన్నాయి.

అంతే కాదు అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ) 11 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) 1 పోస్ట్ ఉంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు వున్నాయి. పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్లో చూడొచ్చు.

అభ్యర్థులు రూ. 25ను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుని ఎస్బీఐ బ్రాంచ్ నుంచి లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి ఈ ఫీజుని చెల్లించచ్చు. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లో మినహాయింపు వుంది. వారు ఫీజు కట్టక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news