మీరు మీ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మంచి డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC కస్టమర్ల కోసం పలు రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి.
ఇక ఈ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే.. LIC కస్టమర్ల కోసం పలు రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటిలో మహిళల కోసం కూడా ప్రత్యేక పాలసీ ఒకటి ఇస్తోంది. అదే ఆధార్ శిలా పాలసీ. దీని వలన చక్కటి ప్రయోజనాలు పొందొచ్చు. మరి వాటి కోసం మనం తెలుసుకుందాం.
ఆధార్ శిలా పాలసీ తీసుకుంటే రాబడితోపాటు రక్షణ కూడా లభిస్తుంది. 8 నుంచి 55 ఏళ్లలోపు వయసు వాళ్ళు ఈ స్కీమ్ లో చేరచ్చు. మెచ్యూరిటీ కాలం అయిపోయిన తర్వాత డబ్బులు లభిస్తాయి. కనీసం రూ.75 వేలకు పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.3 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ పొందొచ్చు. పాలసీ టర్మ్ 10 నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది.
31 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు 20 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకుంటే.. తొలి ఏడాది రూ.10900 వరకు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.29 పొదుపు చేస్తే చాలు. మెచ్యూరిటీ కాలం తర్వాత దాదాపు రూ.4 లక్షలు పొందొచ్చు.
ఒకవేళ పాలసీ గడువులోగా మరణిస్తే.. కుటుంబానికి బీమా డబ్బులు చెల్లిస్తారు. ఇది ఎండోమెంట్ ప్లాన్. అంటే మీకు బోనస్ కూడా లభిస్తుంది. తక్కువ ప్రీమియం పడుతుంది.