తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న LIC..!

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పోరేషన్ LIC ఒక అదిరిపోయే ఆఫర్ ని తీసుకొచ్చిది. దీనితో చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్.

LIC

LIC అందిస్తున్న ఈ ఆఫర్ వలన ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… LIC ఇప్పుడు చౌక వడ్డీ రేటుకే రుణాలు ఇస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రూ.50 లక్షల వరకు రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ ఆగస్ట్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇంకా తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ను సెప్టెంబర్‌ 30లోపు చెల్లించాలి అని కూడా తెలియజేయడం జరిగింది.

కంపెనీ తాజా నిర్ణయంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 6.66 శాతానికి దిగొచ్చాయి. ప్రస్తుతం దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI హోమ్ లోన్స్‌పై 6.65 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ఎల్‌ఐసీ హోమ్‌వై యాప్ ద్వారా లోన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే ఎల్‌ఐసీ హోమ్ లోన్స్‌ పై వడ్డీ రేటు సిబిల్ స్కోరు ప్రాతిపదికన మారుతుందని గమనించాలి. అలానే తీసుకున్న రుణాన్ని 30 ఏళ్ల లోపు చెల్లించొచ్చు.