ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు (Aadhaar card) ఒకటి. పాన్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే ఆధార్ కార్డు కూడా ఎంతో అవసరం. ఆధార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కీమ్స్ కోసం కూడా కచ్చితంగా ఆధార్ కార్డు కావాలి.
ఇంకా ఆధార్ కార్డు వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఆధార్ కి సంబంధించి మోసాలు ఎక్కువైపోతున్నాయి అని యూఐడీఏఐ అంటోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే…
ఆధార్ కార్డు కలిగిన వారు అలర్ట్‌గా ఉండాలి అని అంటోంది యూఐడీఏఐ. ఎక్కువగా ఆధార్ కార్డుకు సంబంధించి మోసాలు పెరిగిపోతున్నాయని అంటోంది. అలానే ఆధార్ నెంబర్లను కేవలం ప్రూఫ్‌గా పరిగణలోకి తీసుకోవద్దని అంటోంది.
ఒకసారి ఎవరైనా ఆధార్ నెంబర్ ప్రూఫ్ గా చెబితే మళ్లీ చెక్ చేసుకోవాలని అంది. ఆధార్ చెక్ చేసుకుంటే ఇటువంటి ఫ్రాడ్స్ ని అప్పచ్చు అని చెబుతోంది. ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
అదే ఆన్‌లైన్‌లో అయితే ఆధార్ వెరిఫై సర్వీసులు ఉపయోగించుకోవాలి అని యూఐడీఏఐ అంది. ఇలా చేయడం వలన మోసాలని అప్పచ్చు అని చెప్పింది.
ఈ విషయాలని యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అలానే పబ్లిక్ కంప్యూటర్లలో ఇఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే అవసరం అయిపోయిన వెంటనే వాటిని డిలేట్ చెయ్యడం మంచిది అని చెప్పింది.