పోస్టాఫీస్‌తో జతకట్టిన ఎల్‌ఐసీ… కస్టమర్లకు సులభంగా హోమ్ రుణాలు..!

మీరు ఎప్పటి నుండో ఇల్లు కట్టాలని అనుకుంటున్నారా..? కానీ అస్సలు అవ్వడం లేదా..? అయితే ఇప్పుడు మీరు మీ సొంతింటి కలని నెరవేర్చుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు భాగస్యామ్యం కుదుర్చుకున్నాయి. దీనితో ఈజీగా హోమ్ లోన్ ని పొందొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఐపీపీఐ కస్టమర్లకు సులభంగానే హోమ్ లోన్స్ అందించాలనే లక్ష్యంగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఐపీపీబీ 4.5 కోట్ల మందికి పైగా కస్టమర్లకు ఎల్‌ఐసీ హౌసింగ్ లోన్ అందుబాటులో వుంది. ఇది ఇలా ఉంటే లోన్ మంజూరు ప్రక్రియను ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లోన్ చూస్తుంది. ఐపీపీబీ కస్టమర్లకు లోన్ ప్రొడక్టులను ఇస్తుంది.

దీని కోసం కూడా ఐపీపీబీ ఇతర సంస్థలతో పార్ట్నర్ షిప్ ని కుదుర్చుకున్నారు. ఇది ఇలా ఉండగా ఐపీపీబీకి దాదాపు 2 లక్షల మంది పోస్టల్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి మైక్రో ఏటీఎం, బయోమెట్రిక్ డివైజ్‌లు ఉన్నాయి. దీనితో డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఇస్తున్నారు. దీనితో హౌసింగ్ కంపెనీకి కూడా లాభదాయకం. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ని తీసుకు వస్తుంది. వడ్డీ రేటు 6.66 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. అయితే సిబిల్ స్కోర్ ని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ఇలా బెనిఫిట్స్ ని పొందొచ్చు.