లోకేష్ నరసారావుపేట పర్యటన పై ఉత్కంఠ..!

నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట లో నారా లోకేష్ పర్యటించనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు నారా లోకేష్ చేరుకుంటారు. ఆ తరవాత గన్నవరం నుండి రోడ్డు మార్గం ద్వారా నరసరావుపేట చేరుకుంటారు. నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని లోకేష్ పరామర్శించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొంటారు.

ఇదిలా ఉంటే లోకేష్ పర్యటన కు గుంటూరు జిల్లా పోలీసులు నిరాకరించారు. నారా లోకేష్ నరసరావుపేట పర్యటన కు అనుమతి లేదు అని స్పష్టం పోలీసులు స్పష్టం చేశారు. కోవిడ్ నేపద్యంలో నారా లోకేష్ పర్యటన కు అనుమతి లేదని జిల్లా పోలీసులు చెప్పారు. అయితే ఖచ్చితంగా నరసరావుపేట వచ్చి తీరుతా అని లోకేష్ పర్యటనకు వెళుతున్నారు. దాంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. లోకేష్ పర్యటన నేపథ్యం లో టెన్షన్ వాతావరణం నెలకొంది.