LIC: రూ.64తో చేతికి రూ.13 లక్షలు…! ఎలా అంటే…?

-

మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అలానే ఎక్కువ బెనిఫిట్స్ ని పొందాలనుకుంటున్నారా…? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. దీనితో మీకు మంచి బెనిఫిట్స్ కూడా వున్నాయి. మరి ఇక వివరాల లోకి వెళితే… దీని వల్ల రెండు రకాల బెనిఫిట్స్ మీకు కలుగుతాయి. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అలానే చేతికి డబ్బులు వస్తాయి.

కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకునే వాళ్లకి ఇది నిజంగా మంచి పాలసీ అనే చెప్పాలి. ఎల్‌ఐసీ చాలా రకాల పాలసీలు అందిస్తోంది. వీటిల్లో ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి. ఇక ఈ పాలసీ గురించి చూస్తే… 18 నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 15 నుంచి 35 ఏళ్ల కాల పరిమితి తో పాలసీ తీసుకోవచ్చు. అయితే ఎలా లాభం వస్తుంది..? ఎంత వస్తుంది..? వంటి వాటి కోసం చూస్తే… ఉదాహరణకు మీరు రూ.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారనుకోండి.

మీ వయసు 35 ఏళ్లు. 25 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ మీరు కనక తీసుకుంటే మీకు పాలసీ గడువు తీరిన తర్వాత చేతికి రూ.13 లక్షలకు పైగా వస్తాయి. రోజుకి రూ.64 ఆదా చేయాలి. నెలకి రూ.1925 చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలలకు అయితే రూ.5775 కట్టాలి. అదే ఆరు నెలలకు అయితే రూ.11,425 చెల్లించాలి. సంవత్సరానికి అయితే రూ.22,600 కట్టాలి ఒకవేళ పాలసీ గడువులోనే పాలసీ దారుడు మరణిస్తే నామినీకి రూ.6.25 లక్షలు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news