భీమవరం వ్యక్తి కిడ్నాప్, తెలంగాణలో దారుణ హత్య !

Join Our Community
follow manalokam on social media

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఒక రొయ్యల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. భీమవరంలో నివాసం ఉండే రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండ రామారావు నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు. తన భర్త కనిపించడం లేదని నాలుగు రోజుల క్రితమే తన భర్తను కిడ్నాప్ చేశారని భార్య ఆరోపిస్తోంది.  ఈ మేరకు పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం జీడి తోటలో కోదండ రామారావు మృతదేహం లభ్యమైంది.

murder
murder

అతనిని భీమవరంలోనే హత్య చేసి మృతదేహాన్ని తెలంగాణకి తీసుకు వచ్చి అచ్యుతాపురం లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మిస్సింగ్ కేసును ఇప్పుడు హత్యకేసు గా మార్చడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద తెలుగులో రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం గా మారిందని చెప్పొచ్చు. అయితే ఆయనని ఎవరు చంపారు అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార లావాదేవీలు దీనికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...