2020 ఏడాదిలో ‘బ్యాంక్ సెలవులు’ ఇవే..

-

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కొత్త సంవత్సరంలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో వెల్లడించింది. తన వెబ్‌సైట్‌లో బ్యాంక్ సెలవులకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజనల్ ఆఫీస్ పరిధుల్లో బ్యాంకులకు ఏఏ రోజులో సెలవు ఉంటుందో వివరించింది. 2020 లో బ్యాంకులకు మొత్తం 20 సెలవులు ఉన్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే.

ఇక మీరు తరచూ బ్యాంకులకు వెళ్తున్నట్టైతే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ డేటా ప్రకారం చూస్తే బ్యాంకులకు వచ్చే ఏడాదిలో 20 రోజులు అధికారిక సెలవులు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జనవరి 15- సంక్రాంతి, ఫిబ్రవరి 21- మహాశివరాత్రి, మార్చి 9- హోలీ, మార్చి 25- ఉగాది, ఏప్రిల్ 1- యాన్యువల్ క్లోజింగ్,
ఏప్రిల్ 2- శ్రీరామనవమి, ఏప్రిల్ 10- గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి రోజున‌ సెల‌వులు

వీటితో పాటు మే 1- మే డే, మే 25- రంజాన్, ఆగస్ట్ 1- బక్రీద్, ఆగస్ట్ 11- శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 22- వినాయక చవితి, అక్టోబర్ 2- గాంధీ జయంతి, అక్టోబర్ 24- దసరా, అక్టోబర్ 30- మిలాద్ ఉన్ నబీ, నవంబర్ 14- దీపావళి, నవంబర్ 30- గురునానక్ జయంతి, డిసెంబర్ 25- క్రిస్మస్ రోజున సెల‌వులు. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసే వారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news