మీ UID లేదా ఈ EID పోయిందా..? అయితే తిరిగి ఇలా తెచ్చుకోండి…!

-

మీరు మీ యుఐడి (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) లేదా ఈఐడి (ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి) లేదా ఒక చిన్న స్లిప్ ఏమైనా మిస్ అయ్యారా…? కంగారు పడకండి. ఏ చింతా లేకుండా మీరు దీనిని ఎంతో సులువుగా పొందవచ్చు. ఎప్పుడైనా మీరు వీటిని కనుక పారేసుకున్న లేదా మిస్ అయినా ఎంతో ఈజీగా మీరు వీటిని పొందొచ్చు. UIDAI వీటిని మిస్ చేసుకున్న వాళ్ళకి ఎంతో ఈజీగా తిరిగి పొందే అవకాశాన్ని ఇస్తోంది. అయితే మరి యుఐడి లేదా ఈఐడి మీరు పొందాలంటే దీనిని పూర్తిగా చూసేయండి. ఈ స్టెప్స్ ప్రకారం మీరు కనుక అనుసరిస్తే మీరు వీటిని పొందవచ్చు.

దీని పొందడానికి మీకు రెండు ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే మీరు 1947 హెల్ప్ లైన్ కి కాల్ చేసి పొందొచ్చు. మరొకటి ఆన్లైన్ పద్ధతి దాని కోసం ఇప్పుడు చూద్దాం..

ఆన్ లైన్ లో మీరు పొందడానికి ముందుగా మీరు uidai.gov.in అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇప్పుడు మీరు ఒక సారి వెబ్ సైట్ లోకి వెళ్ళిన తర్వాత ”మై ఆధార్ సెక్షన్” లోకి వెళ్ళండి.
ఇక్కడ క్లిక్ చేసి మీరు దీనిని తెరిచాక ”ఆధార్ సర్వీసెస్” అని ఉంటుంది.
దాని మీద కూడా క్లిక్ చేయండి.
ఇప్పుడు మీకు ‘Retrieve Lost or Forgotten EID/UID’ అని ఉంటుంది.
ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
మీరు ఏదైతే తిరిగి పొందాలనుకుంటున్నారా దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీ పూర్తి డీటెయిల్స్ ని దీనిలో అప్లోడ్ చేయండి.
మీ పూర్తి పేరు, మీ ఫోన్ నెంబర్ ని, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చెయ్యాలి.
ఇలా చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు సులువుగా పొందవచ్చు.

 


లేదా మీరు resident.uidai.gov.in/lost-uideid సెక్షన్ లో సింపుల్ గా వివరాలు ఎంటర్ చెయ్యాలి. అక్కడ మీరు ఈజీగా పొందొచ్చు.మీ ఆధార్ నమోదు చేసుకున్నప్పుడు ఏ మెయిల్ ఐడి, ఏ మొబైల్  నెంబర్ ఇచ్చారో వాటి ఆధారంగా మీరు లాగిన్ అవ్వాలి దీనిని మర్చిపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version