వాటే ఆఫర్…. రూ.859కే విమాన టికెట్…!

Join Our Community
follow manalokam on social media

విమానం ప్రయాణం చెయ్యాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా కుదరడం లేదా…? లేదా త్వరలో ఏదైనా ట్రిప్ వేయాలని అనుకుంటున్నారా.. ? అయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి ఉంది. వేలల్లో కాదు వందల్లోనే విమానం టికెట్ ని కొనుగోలు చెయ్యొచ్చు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అయితే మరి వివరాలని ఇప్పుడే తెలుసుకుని మంచి ట్రిప్ వేసేయండి. వివరాల లోకి వెళితే… ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ తాజాగా టికెట్ ధరల ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ ని చూస్తే షాక్ అవ్వాల్సిందే.

గోఎయిర్ తాజాగా ప్రయాణికులు రిపబ్లిక్ డే ఫ్రీడమ్ సేల్ టికెట్ ధరల తగ్గింపు ఆఫర్‌ లో భాగంగా టికెట్ ధర కేవలం రూ.859 నుంచే స్టార్ట్ చేసింది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలని చూస్తే… జనవరి 29 వరకు ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫర్ ‌లో భాగంగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 లోపు ఎప్పుడైనా ప్రయాణం చెయ్యవచ్చు. రిపబ్లిక్ డే ముందు కంపెనీ అందిస్తున్న పరిమిత కాల ఆఫర్ ఇది. జనవరి 22 నుంచే ఇది స్టార్ట్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా టికెట్ బుక్ చేసుకుంటే జీరో చేంజ్ ఫీజు ఫెసిలిటీ ఉంది. మీరు విమానం బయలు దేరడానికి 14 రోజుల ముందు వరకు కూడా ప్రయాణం తేదీల్ని మార్చుకోవచ్చు. ఇలా మార్చుకున్న ఎలాంటి చార్జీలు పడవు. ప్రోమో ఫేర్ సీట్లకు ఇది వర్తిస్తుంది. రూ.859 ధరకు దాదాపు 10 లక్షల సీట్లను అందుబాటు లో ఉంచినట్టు కంపెనీ వెల్లడించింది.

 

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...