బంగారం కొనటం ఈ రోజుల్లో మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఇబ్బందికరమైన విషయం. రోజురోజుకు పెరుగుతున్న ఈ బంగారం ధరలతో బంగారం కొనాలంటే వెనుకంజ వేయాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో బంగారం కొనే పరిస్థితి ఉంటుందో లేదో తెలియడం లేదు. ఒక ఏడాది బంగారం ధరలు పెరిగితే మరో ఏడాది తగ్గిపోతున్నాయి. ఒక వేళ బంగారం కొనాలంటే మన వద్ద డబ్బులు ఉండవు.
వీటన్నింటికి బ్రేక్ వేయవచ్చు. అదే గోల్డ్ స్కీం. ఈ స్కీం ద్వారా కొన్ని బంగారం దుకాణాలు విక్రయిస్తున్నాయి. నెలనెలా మనం చిట్టీ వెసుకునే విధంగా మంత్లీ స్కీంలో చేరితే మెచూరిటీ సమయానికి బంగారం కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో చేరితే కాస్తో కూస్తో నెలనెలా బంగారం కొనుగోలు చేసుకోవచ్చు.
మార్కెట్లో ఉన్న జువెలరీ స్కీం ఆఫర్లు
- ఈ పథకంలో మనం నెలనెలా ఈఎంఐ తరహాలో డబ్బులు డిపాజిట్ చేయాలి. అలా ఆఖరి నెల డబ్బులకు బదులుగా బంగారం కొనవచ్చు.
- బంగారంపై తగ్గింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
- టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ ప్రస్తుతం తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ పేరుతో ఒక స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మీరు నెలకు రూ.2,000 నుంచి ఆ పైనా ఎంతైనా కట్టుకోవచ్చు.
- క్రమం తప్పకుండా అలా మీరు 10 నెలలు పాటు పొదుపు చేస్తే మొత్తం రూ.20,000 డిపాజిట్ అవుతుంది. అయితే మీరు పొదపు చేసే డబ్బుతో బంగారం కొంటే.. అప్పుడు మీకు రూ.21,500 విలువైన బంగారం లభిస్తుంది.
- జీఆర్టీ గోల్డ్ సైతం గోల్డెన్ లెవెన్ ఫ్లెక్సీ ప్లాన్ పేరిట ఒక కొత్త స్కీం ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రకారం నెలకు రూ.500 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరిన వారు 11 నెలలు డబ్బులు కడితే ఒక నెల డబ్బులు కంపెనీ అదనంగా మీకు చెల్లిస్తుంది.
- జోస్ అలుక్కాస్ ఆన్ లైన్ ప్లాట్ ఫాం ద్వారా ఈజీ బై పేరిట మరో కొత్త స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో అయితే కనిష్టంగా రూ.1,000 నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. 12 నెలలు డబ్బులు కట్టాలి.దీనిలో వినియోగదారులకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.