నెట్‌ఫ్లిక్స్‌ ఖాతా షేర్‌ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!

-

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే నెట్‌ ఫ్లిక్స్‌ తమ ఖాతాదారుల కోసం మరోసరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీనివల్ల పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను అరికట్టే ప్రయత్నం చేస్తోంది నెట్‌ఫ్లిక్స్‌. సాధారణంగా ఏదైన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ఉంటే ఆ ఐడీని దాదాపు స్నేహితులందరూ ఆ ఐడీ, పాస్‌వర్డ్‌ అందరూ షేర్‌ చేసుకుంటారు. అలాగే ప్రపంచ నంబర్‌ వన్‌ డిజిటల్‌ నెట్‌ఫ్లిక్స్‌ దీన్ని అరికట్టడం కోసమే కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఒకవేళ మీరు నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాదారునితోనే మీరు నివసిస్తున్నారో తెలపాల్సిందిగా కొంతమంది నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులకు మెసేజ్‌ వస్తున్నట్లు తెలిసింది. అనంతరం ధ్రవీకరణ కోసం నెట్‌ ఫ్లిక్స్‌ ఖాతాదారుని మొబైల్‌ నంబర్, లేదా ఈ మెయిల్‌ ఐడీ ఇచ్చి దాన్ని వెరిఫికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నెట్‌ ఫ్లిక్స్‌ చూసేవారు వెరిఫికేషన్‌ డిలే చేసి కాసేపు చూడవచ్చు. అయితే ఈ మెసేజ్‌ మళ్లీ వస్తూనే ఉంటుంది. కాబట్టి వెరిఫికేషన్‌ తప్పనిసరి అన్నమాట. నెట్‌ ఫ్లిక్స్‌ ఖాతా ఓపెన్‌ చేసినవారు మాత్రమే ఉపయోగించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
నెట్‌ఫ్లిక్స్‌ ఎప్పటికప్పుడు సరికొత్త్త ఫీచర్లను ఖాతాదారుల కోసం అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ఈ వెరిఫికేషన్‌ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌ నియమాల ప్రకారం ఒక ఖాతాను ఉపయోచాలంటే వారంతా ఒకే ఇంటికి చెంది ఉండాలి. నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా రెండు రోజులు అందించే స్ట్రీమ్‌ ఫెస్ట్‌ను గతేడాది డిసెంబర్‌లో కంపెనీ నిర్వహించింది. ఇందులో భాగంగా కేవలం రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఎటువంటి కార్డు వివరాలు ఇవ్వకుండా నెట్‌ ఫ్లిక్స్‌ను ఉపయోగించవచ్చు. అయితే ఇలాంటి ఫెస్ట్‌ను నెట్‌ ఫ్లిక్స్‌ మళ్లీ నిర్వహిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లోతో మనకు పరిచయం చేస్తున్న ¯ð ట్‌ఫ్లిక్స్‌కు వినియోగదారులు కూడా ఎక్కువే ఉన్నారు. డిజిటల్‌ నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్‌కు ఆదరణ కూడా అంతగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version