రుణ గ్రహీతల కోసం కొత్త టెక్నాలజీని రూపొందించడం జరిగింది. ఈ టెక్నాలాజీ ఏకంగా ముఖం, మాటలు లోన్ ఇస్తారో లేదో కూడా తెలిసిపోతుంది. ఈ టెక్నాలాజీ తో ఏకంగా రెండు నిమిషాల్లోనే లోన్ ఇస్తారో లేదో అనేది తెలిసిపోతుంది. అయితే మనం ఏమైనా లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకుంటాం. ఒక వేళ ఇలా కాకుంటే ఆన్‌లైన్ లోనే లోన్ కోసం అప్లై చేసుకుని బ్యాంక్‌కు వెళ్లకుండానే లోన్ పని చూస్తాం. ఇలా ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు.
దీనితో వీటిల్లో కూడా లోన్ తీసుకోవచ్చు. లోన్ కోసం శాలరీ స్లిప్, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ ఇలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని వెరిఫై చేసుకున్న తర్వాతనే మీకు లోన్ ఇస్తారో లేదో అనేది తెలుస్తుంది. అలానే మీ క్రెడిట్ స్కోర్‌ను పరిగణ లోకి తీసుకుంటాయి. ఇది అంత ఇలా ఉంటె ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటు లోకి వచ్చింది. ఈ టెక్నాలజీ వల్ల కస్టమర్‌కు లోన్ ఇవ్వాలా? వద్దా? అనేది రెండు నిమిషాల్లోనే తెలిసిపోతుంది.
టోక్యోకు చెందిన డీప్‌స్కోర్ అనే కంపెనీ ఫేసియల్ అండ్ వాయిస్ రికగ్నిషన్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇందులో 10 ప్రశ్నలకి కస్టమర్స్ జవాబు చెప్పాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ AI కస్టమర్ ముఖం, మాటలను విశ్లేషించి స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ బట్టి లోన్ ఇవ్వాలో లేదో చెప్పేస్తాయి. కస్టమర్లు నిజం చెబుతున్నారో లేదో అనేది కూడా ముఖ కదలికలు, మాటల ద్వారా ఏఐ పసిగట్టేస్తుంది. కానీ కొన్ని సార్లు అర్హత కలిగిన వారికి కూడా రుణం లభించకపోవచ్చని కస్టమర్లు అభిప్రాయపడుతున్నారు.