రైతులకి కేంద్రం గుడ్ న్యూస్…కొత్త స్కీమ్ వివరాలు ఇవే…!

-

కొత్త స్కీమ్ తీసుకొచ్చి రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో మోదీ సర్కార్ బడ్జెట్ 2021 లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అన్న దాతలకు ప్రసన్నం చేసుకోవడానికి ఈ కొత్త పథకం తీసుకు రానున్నట్టు తెలుస్తోంది అని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త పథకం ద్వారా మళ్లీ నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ల లోకి డబ్బులు పంపించే అవకాశాలు కనపడుతున్నాయి. యూరియా సబ్సిడీ డబ్బును రైతుల బ్యాంక్ అకౌంట్ల లోకి పంపే ఛాన్స్ ఉంది.

ఇది ఇలా ఉండగా వచ్చే బడ్జెట్‌ లో రూ.80 వేల కోట్ల అదనపు యూరియా సబ్సిడీని ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ మంత్రత్వ శాఖ కోరింది. 2020 నవంబర్‌లో ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రకటించిన రూ.65 వేల కోట్లు ఇది అదనమని అర్ధం అవుతోంది. అయితే ఈ డబ్బులు నేరుగా రైతులు ఖాతాల్లోకి పంపనున్నారు. విశ్వాసనీయ వర్గాలు కూడా యూరియా సబ్సిడీ డబ్బును రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా పంపించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మోదీ సర్కార్ ఫర్టిలైజర్ కంపెనీలకు కాకుండా డైరెక్ట్ గా రైతులకే ఈ డబ్బులు పంపించాలని భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు డీబీటీ స్కీమ్ కేంద్రం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎలా అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే సబ్సిడీ డబ్బులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌ లోకి వచ్చేస్తాయో అదే విధంగా యూరియా కొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news