ఎన్నిసార్లు అప్లై చేసినా.. పీఎఫ్ రిజెక్ట్‌ అవుతోందా..? ఇలా చేయండి..!

-

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పదవీ విరమణ ప్రణాళికల కోసం పొదుపు చేసే ఆర్థిక సంస్థ. ఉద్యోగుల జీతం నుంచి నిర్ణీత మొత్తంలో సొమ్ము జమ చేసుకుని యజమాని నుంచి అంతే మొత్తంతో తీసుకుని.. అధిక వడ్డీ రేటుతో జమ చేస్తూ వుంటారు. ఈపీఎఫ్‌ ఉద్యోగుల కోసం తప్పనిసరి సహకారం పథకంగా భావిస్తారు. ఉద్యోగులు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డబ్బు ని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంతా కూడా ఆన్ లైన్ అయిపొయింది.

దీనితో సమస్యలు పెరుగుతున్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు కానీ ఫిర్యాదులు కానీ ఉంటే ఈపీఎఫ్‌ఓ పోర్టల్లో ఫిర్యాదు చెయ్యచ్చు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఫిర్యాదులు చేయడానికి గ్రీవెన్స్‌ సిస్టమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రత్యేక ప్లాట్‌ఫారమ్, పోర్టల్ ద్వారా సమర్పించిన ఏవైనా ఫిర్యాదులు సంబంధిత అధికారులకు చేరుతాయి.

దీని కోసం ముందు మీరు ఈపీఎఫ్‌ ఐ-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్‌ కి వెళ్ళండి. ఇక్కడ హోంపేజీకి కుడివైపు ఎగువన ఉన్న మెను నుంచి ‘రిజిస్టర్ గ్రీవెన్స్’ని సెలెక్ట్ చేయాలి.
స్థితికి అనుగుణంగా ఎంచుకోవడానికి నాలుగు ఎంపికలు వస్తాయి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అలానే సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్‌ చేయాలి.
ఇప్పుడు ఇక్కడ ‘గెట్ డిటైల్స్’పై క్లిక్ చేయాలి. ఇప్పుడు గెట్‌ ఓటీపీను క్లిక్‌ చేస్తే మీరు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయాలి.
ఇక్కడ వ్యక్తిగత వివరాలు విభాగంలో పీఎఫ్‌ నంబర్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్న ఫిర్యాదు రకాన్ని ఎంచుకోవాలి. అలానే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పత్రాలను అప్‌లోడ్ చేసి యాడ్‌ బటన్‌పై క్లిక్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news