గుడ్ న్యూస్: ఇప్పుడు సులభంగానే ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు ఎలా అంటే..?

-

మీరు రైలులో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా…? లేదా రిజర్వేషన్ చేసుకుని ట్రైన్ ఎక్కాలని అనుకుంటున్నారా..? అయితే ఇక ఏ చింత వద్దు. సరిగ్గా సమయం చూసుకుని స్టేషన్ కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సింపుల్‌గా మెసేజ్ పెడితే చాలు ట్రైన్ వివరాలు మీకు వచ్చేస్తాయి. ట్రైన్ ఎంత సేపట్లో వస్తోంది..?, ఆలస్యంగా నడుస్తోందా..? ఇలా అనేక విషయాలని సులువుగా తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే మీకు సమాచారం అందుతుంది. అంతే కాకుండా పీఎన్ఆర్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.

ఇక వీటి గురించి చూస్తే…. రైలో ఫై అనే సంస్థ మీకు ట్రైన్ అప్‌డేట్ సర్వీసులు అందిస్తోంది. ఇందు కోసం మీరు చెయ్యాల్సింది ఏమిటంటే…? 91-9881193322 నెంబర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వాట్సాప్ ‌లోకి వెళ్లి పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఆ నెంబర్ కి పంపాలి. ఇలా చేయడం తో ట్రైన్ అప్‌డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. అలానే మీరు 91-7349389104ను కూడా స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇలా కూడా ట్రైన్ అప్‌డేట్స్ పొందొచ్చు. ఇది మేక్‌ మైట్రిప్ వాట్సాప్ నెంబర్.

ఇది ఇలా ఉండగా మీ ట్రైన్ వివరాలు తెలుసుకోవడానికి 139కు కాల్ చేయాల్సిన పని లేదు. అలానే ఇండియన్ రైల్వేస్ సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ను లాంచ్ చేసింది. కొత్త ఫీచర్లు తీసుకు వచ్చింది. దీనితో ప్యాసింజర్లకు బెనిఫిట్ కలుగనుంది. కనుక వీటిని మీరు ఉపయోగించుకుంటే ఎన్నో సమాధానాలు మీరు సులువుగా తెలుసుకోవచ్చు. మీ ప్రయాణాన్ని మరెంత సులువు చేసుకోవచ్చు
ఏ చింత లేకుండానే.

Read more RELATED
Recommended to you

Latest news