వీటిని లింక్ చెయ్యకపోతే భారీగా పెనాల్టీతో పాటు ఎన్నో నష్టాలు..!

-

ప్రతీ ఒక్కరు కూడా పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. వీటిని లింక్ చేసుకోవడానికి మార్చి 31, 2022 వరకు ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే మీరు కొత్త ఏడాది లో ట్రాన్సక్షన్స్ చెయ్యాలంటే తప్పక ఇవి లింక్ అయ్యి ఉండాలి. లేకపోతే సర్వీసులు ఆగిపోతాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

aadhar and pancard
aadhar and pancard

పాన్-ఆధార్ లింక్ చేసుకోకపోతే, ఆ పాన్ కార్డును ఇన్‌వాలిడ్‌గా ప్రభుత్వం గుర్తిస్తుంది. అప్పుడు ఈ పాన్ కార్డు పని చెయ్యదు. ఒక ట్రాన్సక్షన్ కూడా చెయ్యడానికి అవ్వదు. ఒక వేళ కనుక మీ పాన్ రద్దు అయితే ఏమవుతుంది..? ఇక ఈ విషయంలోకి వస్తే…

పాన్ కార్డు రద్దయితే ఎన్నో సమస్యలు వస్తాయి. బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకునేందుకు అవ్వదు. అలానే ఎలాంటి ప్రాపర్టీలను కొనలేరు, అమ్మలేరు. కనీసం షేర్లలో కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ పెట్టుబడి పెట్టడానికి కుదరదు. ఇది ఇలా ఉంటే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో మరో కొత్త సెక్షన్‌ను ఆదాయపు పన్ను చట్టంలో చేర్చారు.

అయితే ఈ సెక్షన్ ప్రకారం ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి అని వుంది. ఆదాయపు పన్ను చ ట్టం, 1961లో చేర్చిన సెక్షన్ 234హెచ్ ప్రకారం పాన్ -ఆధార్ లింక్ చేయకపోతే వెయ్యి రూపాయిలు ఫైన్ కట్టాలి. అదే ఒకవేళ ఇన్‌వాలిడ్ పాన్ కార్డుతో ఆర్థిక లావాదేవీ చేసినట్టు గుర్తిస్తే అప్పుడు రూ.10 వేల పెనాల్టీ విధిస్తుంది. అదే తప్పుని రెండో సారి చేస్తే పెనాల్టీ మొత్తం ఎక్కువగా ఉంటుంది.

ఈ పెనాల్టీని నిర్ణయించే అధికారం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారికి వుంది. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 272బీ ప్రకారం, ఈ జరిమానాను విధిస్తారు. అదే విధంగా ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ టీడీఎస్‌పై పడుతుంది. మీ పన్ను 20 శాతం వరకు డిడక్ట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news