హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీలో పదవుల కోసం యూత్ కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన గొడవ.. చిలికి చిలికి చివరకు పెద్ద గొడవకు దారి తీసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇస్తున్నారంటూ.. కొత్తగూడెంకి చెందిన నేతలు ఆందోళనకు దిగటంతో ఘర్షణ మొదలైంది.
మాటా మాటా పెరిగి.. ఆరు వర్గాల నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు నేతలకు గాయాలు అయినట్టు సమాచారం. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న తమకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని పలువురు నేతలు వాపోయారు. ఈ దాడులపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. మరోవైపు పార్టీలో కష్టపడుతున్న మాకు న్యాయం చేయాలని గాంధీ భవన్ కు వచ్చినట్టు చెప్పారు ఓ యువనేత.