మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎన్నో ఉంటాయి. ఇది మనకి చిన్న పని నుండి పెద్ద పని వరకు ఎంతో అవసరం. ఆర్ధిక లావాదేవీలు జరగడానికి పాన్ కార్డు అవసరం. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కూడా ఉండాలి. 18 ఏళ్లు నిండిన వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు కూడా ఉంటుంది. ఓటర్ ఐడీ కార్డు ఉంటేనే ఇండియన్ సిటిజన్ గా గుర్తింపు పొందుతారు.
ప్రభుత్వ స్కీములు కి కూడా డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనిషి బతికి ఉన్నప్పుడు చాలా అవసరం. అయితే ఒక్కసారి మనిషి చనిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏమవుతాయి..?, ఆ తర్వాత వీటిని ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.
ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ మనిషికి సంబంధించి పాన్ కార్డు, పాస్ పోర్టు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వంటి డాక్యుమెంట్లని భద్రంగా ఉంచాలి. వాటిని మనిషి చనిపోయారని ఎక్కడపడితే అక్కడ వదిలేస్తే అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కనుక మనిషి చనిపోయినా సరే ఈ డాక్యుమెంట్స్ ని భద్రపరచాలి.
ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ పాస్ పోర్ట్ పరిమిత కాలం పూర్తయిన తర్వాత దానిని మళ్ళీ పునరుద్ధరించకపోతే పాస్ పోర్ట్ పనిచేయదు. అలానే ఓటర్ ఐడి కార్డుని రద్దు చేయాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వడంతో ఓటర్ కార్డు రద్దు అవుతుంది. రద్దు చేయడం లేదా జాగ్రత్త పరచుకోవడం తప్పక చేయాలి. లేదంటే కొందరు డాక్యుమెంట్లని తీసుకుని అక్రమాలు చేస్తూ ఉంటారు.