పేటీఎం కొత్త సర్వీసులు.. వడ్డీ లేకుండా తక్కువ రుణం..!

-

కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది పేటీఎం. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం paytm తాజాగా కొత్త సర్వీసులుని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

పేటీఎం/ paytm

పీటీఎం పోస్ట్‌పెయిడ్ మిని పేరు తో ఈ సరి కొత్త సేవలుని లాంచ్ చేసింది. బై నౌ.. పే లేటర్ సర్వీసులకు ఇవి ఎక్స్‌టెన్షన్ అని చెప్పొచ్చు. అయితే ఈ లోన్ ని ఎలా ఇస్తారు..?, ఎలా పని చేస్తుంది అనే విషయాలలోకి వెళితే..

పేటీఎం తీసుకు వచ్చిన ఈ కొత్త సర్వీసుల్లో భాగంగా యూజర్లు తక్కువ మొత్తంలో రుణాలు తక్షణం పొందొచ్చు. ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో కలిపి పేటీఎం ఈ కొత్త సర్వీసులుని తీసుకు రావడం జరిగింది.

ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఈ సేవలని పొందడం వలన చాలా మందికి రిలీఫ్ గా ఉంటుంది. అయితే తీసుకున్న రుణాన్ని 30 రోజుల్లోగా తిరిగి చెల్లించాలి. వడ్డీ ఉండదు.

ఇది ఇలా ఉంటే వార్షిక ఫీజులు, యాక్టివేషన్ చార్జీలు వంటివి కూడా ఉండవు. అంతే కాదండి ఏ విధమైన కన్వీనియన్స్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్ట్‌పెయిడ్ మిని ద్వారా రూ.250 నుంచి రూ.1000 వరకు లోన్ తీసుకోవచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఇన్‌స్టంట్ క్రెడిట్ (రూ.60 వేల వరకు) ఇది అదనం. అయితే ఎవరైనా నెలవారీ ఖర్చుల కోసం ఈ పోస్ట్‌పెయిడ్ మిని ద్వారా డబ్బులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version