వావ్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై భారీ ఆఫర్..!

-

కొత్త గ్యాస్ సిలిండర్ ని మీరు బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేయాలని అనుకుంటే అదిరిపోయే ఆఫర్ ఒకటి వుంది. దీనితో మీకు మంచిగా డబ్బులు కూడా మిగులుతాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

గ్యాస్ సిలెండర్ | gas cylinder prices
గ్యాస్ సిలెండర్ | gas cylinder prices

ఇప్పుడు కనుక మీరు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని అనుకుంటే ఇదే మంచి సమయం. గ్యాస్ సిలిండర్‌ బుకింగ్‌ పై భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. ఆ ఆఫర్ ని పొందితే మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. దిగ్గజ ఇవాలెట్ సంస్థ పేటీఎం Paytm gas booking offer ఈ ఆఫర్ ని అందిస్తోంది.

Paytm gas booking offer

దిగ్గజ ఇవాలెట్ సంస్థ పేటీఎం గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఏకంగా రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఒకవేళ కనుక మీరు మొదటి సారి పేటీఎం ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే అప్పుడు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

రూ.900 వరకు ఎంతైనా క్యాష్‌బ్యాక్ రావొచ్చు. 24 గంటలలోగా క్యాష్‌బ్యాక్ డబ్బులు వస్తాయి. దీంతో  సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఊరట కలుగనుంది. మీరు పేటీఎం యాప్‌లోకి వెళ్లి గ్యాస్ సిలిండ‌ర్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది గమనించండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version