ఇలా చేస్తే నెలకు దాదాపు రూ.5 వేలు పొందొచ్చు ..!

Join Our Community
follow manalokam on social media

ప్రతీ నెల మీకు డబ్బులు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి మీరు చూడాల్సిందే. మీరు కనుక ఈ పోస్టాఫీస్ స్కీమ్‌ లో ఒక్కసారి డబ్బులు పెడితే చాలు ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి. అలానే దీనిలో ఎటువంటి రిస్క్ ఉండదు. పూరి వివరాల్లోకి వెళితే… అనేక రకాల స్కీమ్స్ లో ఈ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో మీరు డబ్బులు పెడితే చాలు ప్రతి నెలా డబ్బులు వస్తాయి.

ఈ స్కీమ్‌ లో చేరాలనుకుంటే సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. ఇక ఎంత పెట్టాలి అనే విషయానికి వస్తే… రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.కానీ రూ.వెయ్యి పెడితే మీకు వచ్చే లాభం ఎక్కువగా ఉండదు. దీనిలో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.9 లక్షలు కూడా డిపాజిట్ చేసే వీలుంది జాయింట్ అకౌంట్ కనుక తీసుకుంటే. కానీ ఏదైనా ఒకేసారి డబ్బులు పెట్టాలి. ఆ తర్వాత మీకు ప్రతి నెలా రాబడి వస్తుంది.

రిటైర్ అయిన ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్స్‌కు ఈ స్కీమ్‌ మరెంత బాగుంటుంది. జాయింట్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ లో రూ.9 లక్షలు కనుక డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.59,400 వేల వడ్డీ వస్తుంది. అంటే నెలకు దాదాపు రూ.5 వేలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ ‌పై 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. చూసారా ఎంత లాభమో..! ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, రెండు పాస్‌ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసికెళ్ళి దగ్గరి లోని పోస్టాఫీస్‌కు వెళ్లి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ‌లో చేరొచ్చు.

TOP STORIES

మీరు చేసే జాబ్ మీకు హ్యాపీగా అనిపించాలంటే వీటిని అనుసరించండి..!

మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ...