మెట్రో స్టేషన్ లో సిగ్నల్ ప్రాబ్లమ్.. ప్రయాణికుల జేబులకు చిల్లు..!

-

హైదరాబాద్ మెట్రోలో రోజుకు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణం చేస్తారు. నగరం లో ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా చేరడానికి మెట్రోలో చాలామందికి ట్రావెల్ చేస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో గమ్యస్థానాలని చేరుకోవచ్చు. అయితే ఇప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కొన్నిసార్లు డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి. తాజాగా అటువంటి అనుభవం ఓ ప్రయాణికుడికి ఎదురైంది.

తక్కువ ఖర్చుతో అపరిమితంగా ప్రయాణం చేయడానికి హైదరాబాద్ మెట్రో అధికారులు సూపర్ సేవర్ కార్డు ని తీసుకువచ్చారు. రూ. 59 రీఛార్జ్ చేసుకుంటే నగరం అంతా మెట్రో రూట్ లలో అపరిమితంగా తిరగవచ్చు. ఓ ప్రయాణికుడు సూపర్ సేవర్ కార్డు రీఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతనికి చేదు అనుభవం ఎదురయింది. జేబులో డబ్బులు లేకపోవడం వలన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాలనుకున్నాడు. మెట్రో స్టేషన్ లో సిగ్నల్ ప్రాబ్లం రావడంతో రీఛార్జి అవ్వలేదని సిబ్బంది చేతులెత్తేశారు.

రెండు మూడు క్యూఆర్ కోడ్ మిషన్లు పరిశీలించినా నో సిగ్నల్ అని చూపించడంతో మెట్రో సిబ్బంది డబ్బులు ఇచ్చి రీఛార్జ్ చేసుకోమని చెప్పారు. జేబులో డబ్బులు లేకపోవడంతో చేసేదేమీ లేక ప్రయాణికుడు రోజు వారి కార్డుతో మెట్రోలో ట్రావెల్ చేశాడు. మియాపూర్ వెళ్లడానికి సూపర్ సేవరైతే 59 తో ప్రయాణం చేయొచ్చు కానీ 120 రూపాయలు అయ్యింది నగరం అంతా తిరిగే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. చాలామంది ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే చేస్తున్నారు. అసలు డబ్బులు ఉంచుకోవట్లేదు. కరెన్సీ లేకుండా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. ఇలా ఇండియా డిజిటల్ బాట పడుతున్న తరుణంలో మెట్రోలాంటి కీలకమైన రవాణా వ్యవస్థల్లో డిజిటల్ పేమెంట్ విషయంలో సాంకేతిక సమస్యలు రావడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version