ఏపీ బిజెపి ఎమ్మెల్సీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి నల్లమిల్లి పది ప్రశ్నలు సంధించారు. కాశ్మీర్ ప్రత్యేక జెండాకి మద్దతిస్తారా లేదా? నేషనల్ కాంగ్రెస్ పొత్తును కాంగ్రెస్ సమర్ధిస్తుందా..? నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయమైన పర్యావరణ విధానాన్ని సమర్ధిస్తారా? అంటూ నిలదీశారు. తీవ్రవాదాన్ని తిరిగి తీసుకురావడాన్ని కాంగ్రెస్ సమర్ధిస్తుందా? పహాడీ, గుజరులు, రిజర్వేషన్ లపై కెఎంసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్ధిస్తుందా? అని ఆగ్రహించారు ఏపీ బిజెపి ఎమ్మెల్సీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
జమ్మూ, లోయ మధ్య వివక్షను కాంగ్రెస్ సమర్సదిస్తుందా? అఖండ భారతావని విభజనకు గురైన నేపథ్యంలో భారతదేశ సమగ్రతకు NDA విధానాలకు అడ్డు పడుతున్నారని నిప్పులు చెరిగారు ఏపీ బిజెపి ఎమ్మెల్సీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నేషనల్ కాన్ఫరెన్స్ కు కాంగ్రెస్ సమర్ధించడం సరైనది కాదన్నారు. NDA నిర్ణయాలకు ప్రజలు మద్దతిస్తున్నారు…కాంగ్రెస్ ఊహల్లో ఉంటోందని మండిపడ్డారు ఏపీ బిజెపి ఎమ్మెల్సీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.