టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీ దృష్ట్యా కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు కొత్త ఆఫర్లను ప్రకటించడం సాధారణం. అదే పంథాలో బాటలు వెస్తోంది రిలయన్స్ జియో. తమ వినియోగదారులకు మరో అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌తో కేవలం రూ. 3.5కే 1 జీబీ డేటాను పొందవచ్చు. టెలికాం రంగంలోనే ఎప్పుడూ సంచనలాను సృష్టించే జియో ఏ టెలికాం కంపెనీలు ఇవ్వని అతి తక్కువ ధరకే డేటాను అందిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఇదివరకే రిలయన్స్ జియో రూ .599 రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. దీని వివరాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 84 రోజులు 2జీబీ డేటాను వినియోగదారులకు ఈ ప్లాన్ ద్వారా అందిస్తోంది . అంటే మొత్తం 168 జీబీ డేటా వినియోగదారులకు అందిస్తోంది జియో. అంటే 1 జీబీ డేటాకు అయ్యే ఖర్చు కేవలం రూ.3.5 మాత్రమే.
వేరే ప్లాన్లతో పోల్చితే ఈ ప్లాన్ చాలా తక్కువ. నిత్యం 2 జీబీ డేటా అందించే రూ .249, రూ. 444 ప్లాన్లతో పోల్చితే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు రూ. 444 ప్లాన్ ను తీసుకుంటే, ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. 56 రోజులకు మొత్తం 112జీబీ అందిస్తోంది. అంటే 1జీబీ డేటాకు దాదాపు రూ. 4 వరకు చెల్లిస్తున్నట్లు. వినియోగదారులకు ఆకర్షించడానికి అదేవిధంగా టెలికాం కంపెనీలకు నడుమ పెరుగుతున్న పోటీ తీవ్రం అవుతోంది.తమ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు జియో ఈ కొత్తప్లాన్‌తో అతితక్కువ ధరకే వినియోగదారులకు డేటాను అందిస్తోంది.