ఎల్‌ఐసీ కస్టమర్లకు రిలీఫ్….!

-

ఎల్‌ఐసీ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో ప్రభుత్వ రంగానికి చెందిన దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీనితో పాలసీదారులకు కరోనా కష్ట కాలం లో బెనిఫిట్ కలుగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

మీరు కనుక ఎల్‌ఐసీ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే లైఫ్ సర్టిఫికెట్‌ను ఈమెయిల్ ద్వారా కూడా సబ్‌మిట్ చేయొచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. ఒకవేళ ఎల్‌ఐసీ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే సర్టిఫికెట్‌ను ఆఫీసుకి తీసికెళ్ళక్కర్లేదు. ఇది ఇలా ఉంటే ఎల్‌ఐసీ వీడియో కాల్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికెట్‌ను తీసుకుంటోంది.

కరోనా నేపధ్యం లో కస్టమర్స్ కి వీలుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్‌ఐసీ ఇంకా పాలసీదారులకు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను కూడా ఈజీ చేసేసింది. కరోనా వైరస్ వల్ల చనిపోతే మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ లేకున్నా కూడా క్లెయిమ్స్‌ను చెల్లిస్తోంది.

అయితే కరోనా వల్ల చనిపోయినట్లు ఏదైనా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. డిస్‌చార్జ్ సమరీ, ఈఎస్ఐ లేదా ప్రభుత్వం లేదా కార్పొరేట్ హాస్పిటల్స్ జారీ చేసే డెత్ సమరీ వంటి ప్రూఫ్ ఉంటే చాలు. దీనితో ఎల్‌ఐసీ డెత్ క్లెయిమ్ పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news