గుడ్ న్యూస్: క్షణాల్లో రూ.25 వేల నుంచి రూ.20 లక్షల రుణం! వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా…? మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా ఉందా..? అయితే మీరు క్షణాల్లో లోన్ తీసుకోవచ్చు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పైగా దీనిని చాలా ఈజీగా పొందవచ్చు. అది ఎలా అంటే..? కేవలం మిస్డ్ కాల్ ఇచ్చి లోన్ పొందొచ్చు. ఇక దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్ల కోసం ఎన్నో రకాల సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే వీటిల్లో బ్యాంక్ రుణాలు కూడా ఒక భాగమని చెప్పొచ్చు.

ఈ రుణాలని ఎవరు పొందొచ్చు అనే విషయానికి వస్తే..స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అందిస్తోంది. అయితే బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఎంతో ఈజీగా దీనిని పొందవచ్చు. మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కస్టమర్లు రుణాలని పొందవచ్చు. అప్పుడు బ్యాంక్ ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ కింద అర్హత కలిగిన వాళ్ళు రూ.25 వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు.

పైగా తక్కువ డాక్యుమెంట్లతోనే పని పూర్తవుతుంది. ఇది ఇలా ఉండగా వడ్డీ రేటు కూడా తక్కువ గానే ఉంటుంది. వడ్డీ రేటు 9.6 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతర బ్యాంకుల కన్నా ఇది తక్కువ వడ్డీ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ లోన్ పొందాలంటే నెలకు కనీసం రూ.15 వేల వేతనం వస్తుండాలి.

 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....