గుంటూరు జిల్లాలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రచారానికి వెళ్ళిన జనసేన కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు రాళ్ళదాడి చేసినట్టు చెబుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడులో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ తీరు మీద ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పోలీసుల పహారా కాస్తున్నారు. ఇక ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు మూడు విడతలు పూర్తి కాగా రేపు నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ జరిగిఫలితాలు కూడా వెలువరించనున్నారు.