దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ వ్యాపార రుణాల మంజూరు ప్రక్రియను మరింత సరళతరం చేసింది. అందులో భాగంగా అన్ని అర్హతలు ఉంటే కేవలం గంటలోనే రూ.5 కోట్ల వరకు రుణం పొందే అవకాశాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది.
వ్యాపారానికి లోన్ తీసుకోవాలంటే ఇంతకు ముందు చాలా రోజుల పాటు ఆగాల్సి వచ్చేది. కావల్సిన అర్హతలు ఉన్నా, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించినా లోన్ రావడంలో ఆలస్యమవుతూ ఉంటుంది. అయితే ఇకపై వ్యాపారులు ఆ బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ వ్యాపార రుణాల మంజూరు ప్రక్రియను మరింత సరళతరం చేసింది. అందులో భాగంగా అన్ని అర్హతలు ఉంటే కేవలం గంటలోనే రూ.5 కోట్ల వరకు రుణం పొందే అవకాశాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది.
ప్రస్తుతం చాలా వరకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు లోన్ ఇచ్చే ప్రక్రియను చాలా సులభతరం చేశాయి. ఈ ప్రక్రియ అంతా డిజిటలైజ్ అవడంతో నిమిషాల వ్యవధిలోనే ఏ లోన్ కావాలన్నా మనకు దొరుకుతోంది. ఇక ఎస్‌బీఐ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా వ్యాపార రుణాలనే ఈ పద్ధతిలో అందిస్తోంది. అయితే ఎస్‌బీఐ అందించే ఈ రుణం పొందాలంటే కస్టమర్లు తమ జీఎస్‌టీఐఎన్, ఐటీఆర్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
జీఎస్‌టీఐఎన్, ఐటీఆర్ వివరాలు ఉన్న ఎవరైనా సరే ఆయా వివరాలను ధ్రువపరిచే పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.. కేవలం 1 గంటలోనే ప్రాసెసింగ్ అంతా పూర్తి చేసుకుని లోన్ పొందవచ్చు. అందుకుగాను కస్టమర్లు https://www.psbloansin59minutes.com/sbi లేదా www.psbloansin59minutes.com అనే వెబ్‌సైట్లను సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అన్నీ సరిగ్గా ఉంటే కస్టమర్లు రూ.1 లక్ష మొదలుకొని రూ.5 కోట్ల వరకు వ్యాపార రుణాన్ని పొందవచ్చు. దీన్ని టర్మ్ లేదా వర్కింగ్ క్యాపిటల్, బిజినెస్ కోసం తీసుకోవచ్చు. ఇక ఆయా వెబ్‌సైట్లలో అన్ని వివరాలను ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే కేవలం 59 నిమిషాల్లోనే వ్యాపార రుణాన్ని పొందే సౌకర్యాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది. ఇక రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అయితే కస్టమర్లు తమ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా లోన్ పొందే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించుకోవచ్చు. దీంతో లోన్ చాలా త్వరగా వస్తుంది..!