ప్రభుత్వ పథకాలలో పోస్టాఫీసు పథకాలు బెస్ట్.. తక్కువ పొదుపు చేసిన ఎక్కువ లాభలాను పొందవచ్చు.. ఇప్పటికే ఎన్నో పథకాలను అందించింది.. ఈ క్రమంలోనే పోస్టాఫీస్ అందిస్తోన్న అదిరిపోయే స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ పథకం ద్వారా రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా ఎలాంటి లిమిట్ లేదు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పోస్టాఫీసు ఆర్‌డీ ఏడాదికి 5.8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఈ వడ్డీలో మార్పు త్రైమాసిక ప్రాతిపదికన ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేని పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది ఐదు సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి పొడిగించవచ్చు.. ఇకపోతే మూడేళ్లకే క్లోజ్ చెయ్యొచ్చు.. సింగిల్‌గానే కాకుండా, ముగ్గురు వరకు ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. మైనర్ కోసం నామిని ఖాతాను తెరవవచ్చు.ఈ పథకం ద్వారా నెలకు రూ. 10 వేలు జమ చేస్తే ఎంత ఫండ్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి నెలకు రూ. 10 వేలు కడితే.. ఐదేళ్ల తరువాత మీకు రూ.6,96,968 రిటర్న్ లభిస్తుంది.
ఇందులో మీరు రూ. 6 లక్షలు పెట్టుబడి పెడితే, వచ్చే వడ్డీ రూ. 96,968 లభిస్తుంది. అదే విధంగా ఈ స్కీమ్‌ను మరో ఐదేళ్లు పొడగితస్తే.. రూ. 16,26,476 గ్యారంటీ ఫండ్ లభిస్తుంది. అంటే మీరు రూ. 12 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా రూ. 4,26,476 లభిస్తుంది. నెలకు రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే .. పదేళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 16,26,476 వరకు పొందోచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.. ఇవే కాదు ఎన్నో పథకాలను పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తుంది.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ పథకాలను చూడండి..