ఒకటికి మించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయా..?

ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే ఎన్నో లాభాలని మనం పొందొచ్చు. ఈ మధ్య కాలం లో ఇన్సూరెన్స్ గురించి జనాల్లో అవగాహన బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ అవసరమని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకోసమే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా తీసుకోవడం జరుగుతోంది. అయితే ఒకటి కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలు ఒకరి పేరు మీద చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది తెలుసుకుందాం.

 

LIC
LIC

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సాధారణంగా ఇవి అందరికీ అవసరం లేదు. అవసరం ఉంటేనే మల్టిపుల్ పాలసీల ఎంపికపై నిర్ణయం తీసుకుంటే మంచిది. మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రయోజనాలను వలన ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది చూస్తే… మీరు తీసుకునే పాలసీ వల్ల రాని బెనిఫిట్ వేరే పాలసీ వల్ల కవర్ అవుతుందంటే.. అప్పుడు మరో పాలసీ తీసుకోవడం మంచిది. కనుక ఆ లాభాన్ని పొందాలంటే మరొకటి తీసుకొచ్చు.

అలానే వివిధ అవసరాల కోసం వివిధ ప్లాన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. పెట్టుబడి రాబడుల కోసం చూసేవారు ULIP లలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇలా ఒకటి కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పాలసీలని తీసుకుంటే జీవితానికి భద్రతతో పాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇలా ఇన్సూరెన్స్ పాలసీలతో మీరు పొందొచ్చు. ఏ ఇబ్బంది ఉండదు కూడా.