బ్రిటన్: వ్యాక్సిన్ల అనుమతి జాబితాలో కోవిషీల్డ్..

ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్న వ్యాక్సిన్ తప్పనిసరి. ఐతే ఆయా దేశాఅలు తాము అంగీకరించిన వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకు మాత్రమే దేశానికి రావడానికి అనుమతులు ఇస్తున్నాయి. తాజాగా బ్రిటన్ దేశం తన అనుమతి జాబితాలో ఇండియాకు చెందిన కోవిషీల్డ్ ను కూడా చేర్చింది. ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇండియాకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది.

ఇప్పటి వరకు బ్రిటన్ దేశం ఈ వ్యాక్సిన్ వేసుకుని వచ్చేందుకు అనుమతులు ఇవ్వలేదు. తాజగా బుధవారం రోజున కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోని ఎక్కడ నుండైనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారు బ్రిటన్ ను సందర్శించడానికి రావచ్చని తెలిపింది. మాడెర్నా, ఫైజర్, జాన్సన్ మొదలగు వాటికి మొదటి నుండే అనుమతి లభించింది.