పెళ్లయిన వారికి అదిరే ప్రభుత్వ స్కీమ్…ప్రతి నెలా రూ.10 వేలు పొందొచ్చు…!

-

ఈమధ్య కాలం లో చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. దీని వలన వయసు మళ్లిన తర్వాత ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా మనకి చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో వున్నాయి. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా…? ఆ స్కీమ్ లో డబ్బులు పెట్టి మంచిగా లాభాలను పొందాలనుకుంటున్నారా..?

money

అయితే తప్పక మీరు దీని గురించి చూడాలి. ప్రభుత్వ పెన్షన్ పథకం అటల్ పెన్షన్ యోజన చాలా మంచి స్కీమ్. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. భార్యా భర్త ప్రతి నెలా రూ.10000ను పెన్షన్‌గా పొందవచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు భారత పౌరసత్వం కలిగిన ఎవరైనా సరే ఇందులో డబ్బులు పెట్టచ్చు. బ్యాంకు లేదా పోస్టు ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు ఇందులో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది. రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000ను పెన్షన్‌గా ఈ స్కీమ్ ద్వారా పొందొచ్చు. రూ.5000 వరకు కూడా పెన్షన్ వస్తుంది.

18 ఏళ్ల సమయంలోనే మీరు కనుక అటల్ పెన్షన్ యోజనలో చేరితే, 60 ఏళ్లు వచ్చేసరికి మీకు మంచి పెన్షన్ లభిస్తుంది. రూ.5 వేల పెన్షన్ కోసం రూ.210 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ భార్యా, భర్త వయసు ఇద్దరిదీ 30 కంటే తక్కువ వయసుంటే, నెలకు వారి ఏపీవై అకౌంట్లలో రూ.577 ఇన్వెస్ట్ చేయాలి.

35 ఏళ్లు ఉన్న భార్యాభర్తలైతే నెలకు రూ.902ను డిపాజిట్ చేయాలి. అప్పుడు ప్రతీ నెలా కూడా పెన్షన్ వస్తుంది. అలానే జీవిత భాగస్వామి మరణిస్తే, భార్యకి లేదా భర్తకి రూ. 8.5 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద రూ.లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version