కేంద్రం ఇస్తున్న రూ.50 వేల రుణం కోసం ఇలా అప్లై చెయ్యండి..!

కేంద్రం ప్రజల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. అయితే కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో ముద్రా యోజన కూడా ఒకటి. ఇది లోన్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుని బిజినెస్ ని మొదలు పెట్టచ్చు లేదు అంటే మీ వ్యాపారాన్ని మరెంత బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ స్కీమ్ కింద డబ్బులు పొందొచ్చు. ఇక ఈ ముద్రా యోజన స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

money
money

ఈ స్కీమ్ నుండి డబ్బులు పొందితే వ్యాపారులకు బాగా బెనిఫిట్ గా ఉంటుంది. దీనిలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉంటాయి. పీఎం ముద్రా యోజన లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందొచ్చు. ఇక ఈ రుణాన్ని ఎలా పొందాలి..?, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చూస్తే.. ఆన్‌లైన్‌లో అయినా అప్లై చెయ్యచ్చు లేదా బ్యాంక్ బ్రాంచ్ లో అయినా అప్లై చెయ్యచ్చు.

అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా మీరు ఈజీగా అప్లై చేసుకుని రుణాన్ని పొందొచ్చు.