రూ.60 పొదుపుతో రూ.13 లక్షలని పొందండి..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అలానే ఈ ప్లాన్స్ ని తీసుకోవడం వలన మంచిగా రాబడి వస్తుంది అలానే ఆర్ధిక భద్రత కూడా ఉంటుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఇలా ఒక్క ప్లాన్‌తో ఇన్ని లాభాలు పొందొచ్చు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే ప్లాన్స్ లో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి.

lic

ఈ పాలసీ ద్వారా లోన్ సదుపాయం కూడా పొందడానికి అవుతుంది. జీవన్ లాభ్ పాలసీతో మీరు రూ.13 లక్షలు పొందే అవకాశం కూడా వుంది. ఇలా కనుక మీరు పొందాలంటే రూ.1890 చెల్లిస్తే చాలు. అంటే రూ.60 ఆదా చెయ్యాలి. ఇది ఇలా ఉంటే ఈ ప్లాన్ నాన్ లింక్డ్ స్కీమ్. రాబడి స్టాక్ మార్కెట్‌పై ఆధారపడి ఉండదు. కనుక ఏ మాత్రం రిస్క్ ఉండదు.

ఇక ఈ ప్లాన్ ఎవరు తీసుకొచ్చు అనే విషయానికి వస్తే.. 8 నుంచి 59 ఏళ్లలోపు వయసు కలిగిన వారు దీనిని తీసుకొచ్చు. 16 నుంచి 25 ఏళ్ల వరకు పాలసీ టర్మ్ ఉంటుంది. మీరు మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోచ్చు. అలానే ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. లిమిట్ ఏమి లేదు. కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత బీమా మొత్తం, బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్ వస్తాయి.

పాలసీదారుడు మరణిస్తే ఈ డబ్బులు నామినీకి ఇస్తారు. ఇది ఇలా ఉంటే పాలసీ టర్మ్ 3 రకాలుగా ఉంటుంది. 25 ఏళ్లు టర్మ్ ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 21 ఏళ్లు టర్మ్ ఎంచుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అదే 16 ఏళ్లు టర్మ్ అయితే 10 ఏళ్లు ప్రీమియం కట్టాలి.

ఒకవేళ కనుక 25 ఏళ్ల పాలసీ టర్మ్ ని ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం కట్టాలి. రూ. 5 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు రూ.1890 ప్రీమియం పడుతుంది. అంటే రోజుకు రూ.60 పొదుపు చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.13 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news