ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ : ఆడపిల్ల పెళ్లికి ఎందుకు టెన్షన్.. రోజుకు రూ. 75 సేవ్‌ చేస్తే చాలుగా..!

-

ఆడపిల్ల పుట్టిందంటే.. వెంటనే అమ్మో ఎలాగోలా చదివిస్తాం కానీ.. పెళ్లి చేయడం అంటేనే కష్టం, అంత అంత కట్నం ఎక్కడనుంచి తేవాలి.. అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఆడపిల్ల అంటే ఖర్చుకు కేరాఫ్‌ అడ్రస్‌ కాదు.. లక్ష్మీదేవికి ల్యాండ్‌మార్క్‌ అనే రోజులు రావాలి. మీకు ఖర్చు బరువు కాకుండదంటే.. రోజుకు 75 రూపాయలు పక్కనపెట్టండి చాలు. కుమార్తె పెళ్లి ఘనంగా చేయొచ్చు. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని ఎల్‌ఐసీ తీసుకొచ్చింది.

LIC

ఎల్‌ఐసీ కన్యాదాన్ సేవింగ్స్‌ ప్లాన్‌ను బాలిక తండ్రి మేనేజ్‌ చేస్తాడు. తండ్రి మరణానంతరం, బీమా బెనిఫిట్స్‌ కుమార్తెకు అందుతాయి. కుటుంబ పెద్ద చనిపోయిన కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఈ పాలసీ ఆ కుటుంబానికి, ముఖ్యంగా అమ్మాయి భవిష్యత్‌కు సపోర్ట్‌గా నిలుస్తుంది. ఈ పాలసీ వ్యవధి 25 ఏళ్లు. కనిష్టంగా 13 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు కట్టాలి. పాలసీ తీసుకునే పాప తండ్రి వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎల్‌ఐసీ కన్యాదాన్‌ పాలసీ వివరాలు:

పాలసీదారు (తండ్రి) చనిపోతే:

పాలసీ కడుతున్న సమయంలో దురదృష్టవశాత్తూ తండ్రి మరణిస్తే, తదుపరి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌:

తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే, పాలసీ కింద 10 లక్షల రూపాయలను తక్షణ చెల్లిస్తారు.

నాన్-యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్:

ప్రమాదంలో కాకుండా సహజ మరణం సంభవించినప్పుడు కూడా, LIC కన్యాదాన్ పాలసీ తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆ సమయంలో పాలసీ 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. తక్షణ ఖర్చులు, బాధ్యతలను తీర్చుకోడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.

వార్షిక చెల్లింపు:

తండ్రి మరణం తర్వాత, కుమార్తెకు ఈ పాలసీ అండగా నిలుస్తుంది. పాలసీ మెచ్యూరిటీ సమయం వరకు సంవత్సరానికి 50,000 రూపాయలు చెల్లిస్తుంది.

వివాహ పొదుపు:

LIC కన్యాదన్ పాలసీ ప్రత్యేక ఫీచర్‌లో వెడ్డింగ్‌ సేవింగ్స్‌ ఒకటి. రోజుకు 75 రూపాయల వరకు పొదుపు చేయడం ద్వారా, పాలసీదారులు తమ కుమార్తె వివాహం నాటికి 14.5 లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేసుకోవచ్చు.
రోజుకు 151 రూపాయలు ఆదా చేస్తే, కుమార్తె వివాహ ఖర్చుల రూపంలో 31 లక్షల రూపాయలు చేతికి అందుతాయి.

అర్హతలు ఏంటి:

భారతదేశంలోని ప్రతి పౌరుడు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు.
ఈ స్కీమ్‌ను అందించే బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.
ఒక్క కుమార్తె కోసం ఒక్క అకౌంట్‌ మాత్రమే స్టార్‌ చేయాలి, అంతకుమించి తెరవడానికి అనుమతి లేదు.

ఇతర వివరాలు :

18 సంవత్సరాల వయస్సు తర్వాత, ఆ బాలిక తన ఉన్నత విద్య కోసం గరిష్టంగా 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.
పాపకు 10 సంవత్సరాల వయస్సు రాక ముందు, ఖాతా తెరవడానికి అమ్మాయి పేరును ఉపయోగించవచ్చు.
బాలిక బర్త్‌ సర్టిఫికెట్‌, బాలిక & సంరక్షకుల చిరునామాలు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలను పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌లో సమర్పించాలి
ఖాతా తెరవాలంటే కనీసం రూ. 250 అవసరం.
నెలవారీ ప్రీమియం చెల్లించిన 25 సంవత్సరాల తర్వాత, రోజువారీ పెట్టుబడి రూ.75తో రూ.14 లక్షలు వస్తాయి.
ఈ అకౌంట్‌ను భారతదేశంలోని ఏ ప్రాంతానికై బదిలీ చేయవచ్చు.
ఒకవేళ అమ్మాయి మరణిస్తే, డెత్ సర్టిఫికేట్ కాపీ తీసుకొచ్చి అకౌంట్‌ క్లోజ్‌ చేయవచ్చు. అప్పుడు డిపాజిట్ చేసిన డబ్బును వడ్డీతో కలిపి సంరక్షకుడికి తిరిగి వస్తుంది. ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్యం వస్తే, ఖాతాను 5 సంవత్సరాల్లో క్లోజ్‌ చేయవచ్చు.

మధ్యలో కట్టకలేకపోతే..

ఏ కారణం వల్లనైనా LIC కన్యాదాన్ పాలసీని కొనసాగించలేకపోతే, కనీసం రెండు సంవత్సరాలు పేమెంట్స్‌ చేసిన తర్వాత, ఎప్పుడైనా దానిని సరెండర్ చేయవచ్చు. పాలసీని సరెండర్ చేసిన తర్వాత, గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ లేదా స్పెషల్ సరెండర్ వాల్యూలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని LIC చెల్లిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news