ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా: నేడే యాషెస్ చివరి టెస్ట్ … పరువు కోసం ఇంగ్లాండ్ పోరాటం !

-

యాషెస్ క్రికెట్ సిరీస్ ను గెలుచుకోవడం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలకు ఎంత ప్రతిష్ఠతో కూడిన విషయం అన్నది తెలిసిందే. ఒకటిన్నర నెలగా రెండు జట్లు సిరీస్ కోసం ఎంతగానో పోరాడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు నాలుగు టెస్ట్ లు పూర్తి కాగా, సిరీస్ లో ఆస్ట్రేలియా 2 – 1 ఆధిక్యంలో ఉంది, గత టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం ఆఖరి టెస్ట్ స్టార్ట్ కానుంది.. ఇందులో ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ 3 – 1 తేడాతో గెలుచుకుంటుంది, ఒకవేళ ఇంగ్లాండ్ కనుక గెలిస్తే 2 – 2తో సిరీస్ ను సమం చేసే అవకాశం ఉంటుంది. సిరీస్ ను డ్రా చేసుకుంటే కనీసం యాషెస్ ఛాంపియన్ షిప్ దక్కనున్న పరువు అయినా దక్కించుకుంటారు. మరి ఈ మ్యాచ్ లండన్ లో జరగనుండగా, ఎవరు గెలుస్తారు ? అన్నది తెలియాలంటే కనీసం రెండు రోజులు అయినా వెయిట్ చేయాలి.

బెన్ స్టోక్స్ కెప్టెన్ గా ఆడుతున్న మొదటి యాషెస్ సిరీస్ ఇదే కావడంతో ఎలాగైనా సిరీస్ ను డ్రా చేయాలని ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news